తల్లి సన్నీలియోన్.. తండ్రిఇమ్రాన్‌ హష్మి.. ఇక రొమాన్స్ టాప్.. !!

కిస్సింగ్ స్పెషలిస్ట్ ఇమ్రాన్ హష్మి, శృంగార తార సన్నిలియోన్ భార్య-భర్తలుగా మారితే. రంగంలోకి దిగితే.. ఇంకేముంటుంది. రొమాన్స్ కే రొమాన్స్ నేర్పిస్తారేమో. నిజంగా వీరిద్దరిని భార్య-భర్తలుగా మార్చింది.. ఓ కాలేజీ యాజమాన్యం. ఓ విద్యార్థికి తల్లిగా సన్నీని, తండ్రిగా ఇమ్రాన్ రష్మిని చేసింది. ఇప్పుడీ ఈ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే ?

ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్‌లో ఉండే కుందన్ కుమార్ (20) అనే యువకుడు ధనరాజ్‌ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్‌ టికెట్‌ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్‌ అయ్యాడు. ఎందుకంటే ? దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్‌ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్‌ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ అడ్మిట్‌ కార్డ్‌ తెగ వైరలవుతోంది.