అందుకే హార్ధిక్’ని టెస్టులోకి తీసుకోలేదు : కోహ్లీ
ఆసీస్ టూర్ లో వన్డే, టీ20 సిరీస్ లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అదరగొట్టాడు. అయితే అతడిని టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేయకపోవడం విమర్శలొస్తున్నాయ్. దీనిపై తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. హార్ధిక్ ని ఎంపిక చేయకపోవడానికి కారణాలని విమరించారు.
టెస్టు క్రికెట్ అనేది ఒక భిన్నమైన గేమ్. కానీ అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌలింగ్ చేయలేడు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఒకవేళ ఎంపిక చేస్తే బౌలర్ కూడా హార్దిక్ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే అతన్ని పరిగణించలేకపోయాం.
హార్దిక్ కనుక టెస్టు జట్టులో ఉండి ఉంటే జట్టులో మరింత సమతుల్యం వచ్చేది. హార్దిక్ బౌలింగ్‌కు ఇంకా ఫిట్ కాలేకపోవడం వల్లే తనకు తానుగా స్వదేశానికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సన్నద్ధ కావడానికి కూడా విశ్రాంతి అవసరమనే హార్దిక్ భావించాడని కోహ్లీ తెలిపారు.
గతేడాది వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న హార్దిక్ సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఈ ఏడాది ఒక దేశవాళీ ట్రోఫీలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న హార్దిక్ మళ్లీ టీమిండియా జట్టులో స్థానం సంపాదించాడు. అయితే పూర్తి ఫీట్నెస్ సాధించని నేపథ్యంలో టీ20, వన్ డే సిరీస్ లోనూ హార్థిక్ బౌలింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే.