బిగ్ షాక్ : బిగ్ బాస్ హౌస్’లో హత్యా ప్రయత్నం !

బిగ్ బాస్ ఇంట్లో మంట పుట్టింది. ఈ మట్టల్లో ఖాళీ పోయేది ఎవరు ? అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే ? బిగ్ బాస్ ఇంట్లో సోహైల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. అతడికి టైటిల్ విన్ అయ్యే అవకాశాలున్నాయ్. అయితే సోహైల్ చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. బుధవారం ఏపీసోడ్ లో అరియానాతో గొడవకు దొగాడు. ఆమెని టార్గెట్ చేస్తూ.. విరుచుకుపడ్దాడు. ఈ ఏపీసోడ్ లో న్యాయం అరియానా వైపే ఉందని షో చూస్తున్న నెటిజన్స్ అంటున్నారు.

ఇక నిన్నటి గొడవకు కొనసాగింపుగా అరియానా బొమ్మ చింటుని టార్గెట్ చేశాడు సోహైల్. చింటుతో సరదాగా సంభాషణ మొదలెట్టిన సోహైల్.. నిన్ను చంపుతానంటూ దూసుకెళ్లాడం.. ఆయన్ని మోనాల్ ఆపడం తాజా ప్రోమోలో చూడొచ్చు. చింటుపై సోహైల్ సీరియస్ గానే చిందులేసి.. అవి మాత్రం ప్రేక్షకులకి నవ్వులు తెప్పిస్తున్నాయ్. తాజా ప్రోమోని మీరు ఓ సారి చూసేయండీ… !