నిహారిక పెళ్లి.. పవన్ భార్య రాలేదేంటీ !?
మెగా డాటర్ నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొని సందడి చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరోజు ముందే మెగా సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. అయితే నిహారిక పెళ్లి వేడుకకి పవన్ భార్య హాజరుకాలేదు. ఎందుకు ? ఆమెని మెగా ఫ్యామిలీ కావాలనే దూరం పెట్టిందా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అలాంటిదేమీ. చిరు, నాగబాబు ఇంట్లో ఏ చిన్ని కార్యక్రమం జరిగినా.. పవన్ భార్య పిల్లలతో కలిసి హాజరవుతుంటుంది. అలాంటిది నిహారిక పెళ్లికి ఆమె రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ప్రస్తుతం పవన్ భార్య హైదరాబాద్ లో లేరని, రష్యా వెళ్లారని అందుకే హాజరు కాలేదని తెలుస్తోంది.
పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లారని వినిపిస్తోంది. పవన్ భార్యకు ఓ అలవాటు వుందని, ప్రతి ఏటా డిసెంబర్ లో రష్యా వెళ్లి క్రిస్మస్ వేడుకలు చేసుకుని, సరిగ్గా క్రిస్మస్ టైమ్ కు హైదరాబాద్ వచ్చేస్తారట. ఈ సారి అలాగే రష్యా వెళ్లారని తెలుస్తోంది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా నిహారిక పెళ్లి వేడుకకి హాజరుకాలేదు. కానీ పిల్లలని పవన్ తో పంపించేశారు. నిహారిక పెళ్లిలో వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.