పుష్ప.. బ్యాక్ టు సెట్స్ !

పుష్ప సినిమా షూటింగ్ కు సడెన్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. యూనిట్ లోని కొందరు సభ్యులకి కరోనా సోకడంతో షూటింగ్ కి ప్యాకపె చెప్పేశారు. బ్రేక్ తీసుకున్నారు. పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభం కావడం ఆలస్యం అవుతుందని భావించారు. కానీ ఈ నెల 13 నుంచే పుష్ప షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతుంది.

అలాగని మారేడుపల్లి షెడ్యూల్ ని కొనసాగించడం లేదు. అక్కడ మరో ఐదారురోజుల షూటింగ్ బాకీ వుంది. దాన్ని అలాగే ఉంచి.. హైదరాబాద్ శివార్లలో కొత్త షెడ్యూల్ ని మొదలెట్టనున్నారు. ఈ షెడ్యూల్ లో బన్నీ పాల్గొంటారా ? లేదా ?? అన్నది క్లారిటీ లేదు. పుష్ప షూటింగ్ కోసం ఈ నెల 12 నుంచి కొందరు నటీనటుల కాల్షీట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 13 నుంచి ఫ్రెష్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు.

ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో ఊరమాసు పాత్రలో కనిపించనున్నారు. ఆయనకి జంటగా రష్మిక మందన నటించనున్నారు. ఇక ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నారు. దిశాపటానీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.