బిగ్ సప్రైజ్ : బుమ్రా (55) హాఫ్ సెంచరీ.. నాటౌట్ !
బిగ్ బ్రేకింగ్.. టీమిండియా కొత్త ఆల్ రౌండర్ దొరికాడు. ఆస్ట్రేలియా-ఏ తో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో బుమ్రా బ్యాట్ తో అదరగొట్టాడు. 55 (57 బంతుల్లో, 6ఫోర్లు, 2 సిక్సులు) పరుగులతో అజేయంగా నిలిచాడు. బుమ్రా బ్యాట్ తో రెచ్చిపోవడం ప్రేక్షకులకి మాత్రమే కాదు.. టీమిండియ సభ్యులకి షాకింగ్ అనిపించింది. అందుకే.. బుమ్రా డ్రెస్సింగ్ రూములోకి వస్తుండగా టీమిండియా సభ్యులు తమ చేతులు పైకెత్తి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ప్రకటించి బుమ్రాను గౌరవించారు.
ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమిండియా చెత్త ప్రదర్శన చేసింది. 194 పరుగులకే చాప చుట్టేసింది. బుమ్రా సంచలన ఇన్నింగ్స్ ఆడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే.. టీమిండియా వందకు అటు ఇటుగా ప్యాకప్ అయ్యేది. ఇక ఆఖరి వికెట్ కు బుమ్రాతో పాటు సిరాజ్ (22) రాణించాడు. భారత్ 48.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ పృథ్వీ షా 40, శుభ్ మాన్ గిల్ 43 పరుగులు చేశారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 2, హనుమ విహారి 15, కెప్టెన్ అజింక్యా రహానే 4, రిషభ్ పంత్ 5, వృద్ధిమాన్ సాహా 0, సైనీ 4, షమీ 0 పరుగులకు వెనుదిరిగారు. ఆస్ట్రేలియా-ఏ జట్టు బౌలర్లలో షాన్ అబ్బాట్ 3, జాక్ విల్డర్ మూత్ 3 వికెట్లతో రాణించారు.
When someone told me that 2020 is wrost year.
I replied No…. See this 👇#AUSvIND #bumrah@Jaspritbumrah93 pic.twitter.com/GNTyaVoXvN— 𝓨𝓪𝓼𝓱 𝓥𝓪𝓬𝓱𝓱𝓪𝓷𝓲 (@yash_vachhani_) December 11, 2020