శభాష్ : పెట్టుబడి మద్దతు.. ఆదార్’తో లింకు

తెలంగాణ ప్రభుత్వం భూ-రికార్డుల ప్రక్షాణళనని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలని పంపిణీ చేయనుంది. మార్చి నెలలో ఈ పంపిణీ కార్యక్రమం ఉండనుంది. అంతకంటే ముందే భూముల రికార్డులన్నీ ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

పెట్టుబడి మద్దతు పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు భూముల రికార్డులన్నీ ఆధార్‌ కార్డులతో అనుసంధానం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ అనుసంధానం చేయించుకోని వారి భూములను బినామీ ఆస్తులుగా గుర్తించాలని సూచించారు. రికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన వివరాలన్నీ ‘ధరణి వెబ్‌సైట్‌’లో నమోదుచేసే పని జరుగుతున్నది తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంతో అసలు రైతుకు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి మద్దతు అందనుంది. దీంతో పాటు భినామీలు భూముల లెక్క తేలనుంది. ఒకరకంగా ఈ ప్రయత్నం ప్రభుత్వ ఖజానాను పెంచినట్టే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.