జాన్వికపూర్‌ని కాపీ కొట్టిన నిహారిక
బుధవారం ఉదయపూర్ లో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వివాహ విందు జరిగింది. రిసెప్షన్‌లో నిహారిక.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్ర రూపొందించిన బ్రైడల్ లెహంగాని ధరించి మెరిసిపోయారు. లైట్ గ్రీన్, గోల్డ్ కలర్‌లో ఉన్న ఈ లెహంగాలో నిహారిక చాలా అందంగా కనిపించారు. అయితే ఈ డ్రెస్ కాపీ అని నెటిజన్స్ తేల్చేశారు.
ఇటీవల ఓ ప్రకటనలో జాన్వికపూర్ ఈ లెహంగానే ధరించి రాకుమార్తెలా ముస్తాబయ్యారు. ఆమె ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయ్. తాజాగా రిసెప్షన్ కోసం నిహారిక అదే తరహా లెహంగాలో కనిపించడంతో పలువురు నెటిజన్లు.. ‘వావ్.. మనీశ్ దుస్తుల్లో అప్పుడు జాన్వి.. ఇప్పుడు నిహారిక ఎంతో అందంగా ఉన్నారు.’, ‘కొత్త పెళ్లికూతురు మరెంతో అందంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నిహారిక జాన్వీకపూర్ ని కాపీ కొట్టిందని కామెంట్స్ పెడుతున్నారు.