బాబుని రేప్ చేసేశాడు
ఏపీ తెలుగుదేశం పార్టీకి భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఆయన ప్రతిసారి టీడీపీ, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా, మరోసారి వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన వీర్రాజు సీఎం చంద్రబాబుని దాదాపు రేప్ చేసినంత పని చేశాడని గుసగుసలో వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ద్వంధ్వ వైఖరిని సోము ఏకీపారేశాడు. హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు అంగీకరించారు. ప్యాకేజీ ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు చెపుతూ మంత్రిమండలితో పాటు అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. ఇకపై ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది. హోదా అంటే జైలులో పెడతారాని స్వయంగా చంద్రబాబు అన్నారు.
హోదాకు, ప్యాకేజీకి మధ్య రూ.3వేల కోట్లే తేడా మాత్రమే ఉంటుంది. అంతకంటే ఎక్కు వ మనమే సాధించామంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకొన్నారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదాపై కొత్త పలుకులు పలుకుతున్నాడంటూ విమర్శలు చేశారు సోము. సోము సీఎం చంద్రబాబుని ఢీకొనడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ బాబుకు ఆయన చుక్కలు చూపించిన సందర్బాలున్నాయి. మరీ.. సోముకు బాబు ఏ విధంగా చెక్ పెడతారనేది చూడాలి.