విరాటపర్వం.. ఒకేరోజు రెండు గిఫ్టులు !

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. సాయి పల్లవి హీరోయిన్. నక్సలిజం, ప్రేమ వ్యవరాలతో కూడిన ఈ కథలో మహిళా పాత్రలకి మంచి ప్రాధాన్యం ఉండనుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, నివేదా పేతురాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రానా బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి రేపు గిఫ్టులు రాబోతున్నాయి. రేపు ఉదయం 9:09 నిమిషాలకు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక ఉదయం 11: 07 నిమిషాలకు First glimpse విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.