రైతులకు మద్దతుగా సీఎం నిరాహార దీక్ష
నూతన వ్యవసాయ చట్టాలని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. వారికి పలు రాజకీయపక్షాలు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా రైతుల ఆందోళనకి మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు రైతులకి మద్దతుగా ఒక్కరోజు దీక్ష చేస్తున్నట్టు క్రేజీవాల్ ప్రకటించారు.
ఆప్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలు కూడా ఒక్కరోజు నిరాహార దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తన ‘అహంకారం’ వీడాలని కేజ్రీవాల్ అన్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కోరారు.