మోడీ ఫ్రంట్’కు ట్రై చేసిన కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీల నుంచి దేశానికి విముక్తి కలిగించాలన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన కోరిక. ఇందుకోసం ప్రయత్నాలు కూడా చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ కోసం ట్రై చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని కలిశారు. కానీ థర్డ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయలేకపోయారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగియగానే ఢిల్లీ వెళ్తా. బీజేపీ యేతర కూటమిని ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే గ్రేటర్ ఎన్నికలు ముగియగానే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కానీ థర్డ్ ఫ్రంట్ కోసం కాదు. ప్రధాని మోడీ దీవెనల కోసం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులని కలిసి విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం ఢిల్లీ వెళ్లలేదు. మోడీ ఫ్రంట్ కోసం వెళ్లారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకి కావాల్సింది విమానాశ్రయాలు కాదు.. మంచి రోడ్లని సూచిస్తున్నారు. మొత్తానికి.. బీజేపీపై కేసీఆర్ లో మునుపటి కసి మాత్రం కనిపించడం లేదన్నది నిజం. ఎందుకంటే ? గ్రేటర్ ఎన్నికలతో ఆయనకి జ్ఝానోదయం అయి ఉంటుంది.