బీజేపీ మరో విభజన చిచ్చు

బీజేపీ మరో విభజన చిచ్చు తెలుగు రాష్ట్రం ఏపీలో టీడీపీ-భాజాపాల మిత్రబంధం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైన ఈ బంధం తెగిపోయేలా కనబడుతోంది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భాజాపా, టీడీపీలు కత్తులు దూసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపా చాలా సున్నితమైన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది భవిష్యత్ తో ఏపీ మళ్లీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందకు కూడా పునాది కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాయలసీమ భాజాపా నేతలు ఓ తీర్మాణం చేశారు. 16 అంశాలతో కూడిన రాయలసీమ డిక్లరేషన్‌ను ప్రకటించేశారు. ఇందులో రాయలసీమ ప్రాంతంలోనే హైకోర్టు ఏర్పాటుచేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రెండవ రాజధానిని రాయలసీమలో ఏర్పాటుచేసి, అసెంబ్లి భవనం నిర్మించాలి. ఆరు నెలలకోసారి అసెంబ్లీ సమా వేశాలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని తీర్మాణంలో పేర్కొన్నారు. ఈ తీర్మాణంలోని అంశాలు భవిష్యత్ లో అమలుకాని యెడల ఇది కాస్త ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసం ఉద్యమించేలా పరిణామాలు చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరీ.. ఈ తీర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అనేది ఆసక్తిగా మారింది.