రామాయణం స్క్రిప్ట్ పూర్తి చేసిన త్రివిక్రమ్ !

ఈ యేడాది ‘అల.. వైకుంఠపురంలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావడానికి ఇంకా పట్టేట్టు ఉంది. మరీ.. ఈ లాంగ్ గ్యాప్ లో త్రివిక్రమ్ ఏం చేస్తున్నారు అంటే.. ? రామాయణం స్క్రిప్టుని పూర్తి చేస్తున్నారు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ భారీ లెవెల్ లో బాలీవుడ్ జనాలతో కలిసి రామాయణం సినిమాను తీసే ప్రయత్నాల్లో వున్న సంగతి తెలిసిందే. అరవింద్ కోరిక మేరకు రామాయాణం మొత్తాన్ని మూడు గంటల సినిమా స్క్రిప్ట్ గా మార్చారు త్రివిక్రమ్. తెలుగులో డైలాగ్ వెర్షన్ కూడా ఆయనే రాసారు. దీన్ని బేస్ చేసుకుని మిగిలిన స్క్రిప్ట్ లను తయారుచేసుకుంటారు. ఈ జనరేషన్ కు నచ్చేలా, రామాయణం ఔన్నత్యం, ఔచిత్యం చెడకుండా వుండేలా, చాలా సినిమాటిక్ అడాప్షన్ స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ తయారు చేసి అందించినట్లు తెలుస్తోంది.