‘విరాటపర్వం’ టీజర్ వచ్చేసింది

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. సాయి పల్లవి హీరోయిన్. న‌క్స‌లిజం నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. రానా దగ్గుబాటి పుట్టినరోజు కానుకగా తాజాగా ఈ సినిమా నుంచి చిన్నిపాటి టీజర్ ని వదిలారు.

ఇందులో ‘ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్ద జీవితం అతనిది. సత్యాన్వేషనలో నెత్తిరోడిన హృదయం అతనిది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రెడ్ రవన్న’గా రానాని చూపించారు. రవన్నగా రానా కనిపించిన కొన్ని నక్సల్స్ బిట్ సీన్స్ ని చూపించారు. ఈ టీజర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.ఈ సినిమాలో మహిళా పాత్రలకి మంచి ప్రాధాన్యం ఉండనుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, నివేదా పేతురాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.