సోలో బ్రతుకే సో బెటర్ – 108 శ్లోకాలు వింటారా ?

సోలో గాళ్లకి ప్రతినిధిగా మారాడు మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ.. పెళ్లి వద్దు. సింగిలే ముద్దు అంటున్నారు. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. తేజుకి జంటగా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటాషా నటించింది. ఈ నెల 25న సోలో బ్రతుకే సో బెటర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచారు. తాజాగా సోలోగాళ్ల ప్రతినిధి తేజు నటించిన 108శ్లోకాలని వినిపించే ప్రయత్నం చేశారు. ఇందులో మచ్చుచుకొన్నింటిని కట్ చేసి.. టీజర్ గా వదిలారు. అవి పెళ్లికానీ ప్రసాదులని ఆకట్టుకునేలా ఉన్నాయి. వాటిని మీరు ఓసారి వినేయండీ…!