రోహిత్ ‘డబుల్ సెంచరీ’ హామీ

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేసిన అది గ్రేట్. అలాంటిది టీమిండియా ఓపెనర్ ఖాతాలో మూడు డబుల్ సెంచరీలున్నాయి. అయితే హిట్ మ్యాన్ ఆఖరి డబుల్ సెంచరీ బాది ఆదివారానికి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ క్రీడావార్తా సంస్థ రోహిత్‌ ఘనతను కీర్తిస్తూ ఓ ట్వీట్‌ చేయగా.. అతడు స్పందించాడు. తన బ్యాట్‌ నుంచి మరిన్ని డబుల్స్‌ రానున్నాయని హామీ ఇచ్చాడు.

రోహిత్ తొలిసారి 2013లో ఆస్ట్రేలియాపై (209; 158 బంతుల్లో 12×4, 16×6) పరుగులు చేశాడు. మరుసటి ఏడాదే శ్రీలంకపై వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (264; 173 బంతుల్లో 33×4, 9×6) నమోదు చేశాడు. మరో మూడేళ్లకు అదే లంక(208నాటౌట్‌; 153 బంతుల్లో 13×4, 12×6)పై రెండోసారి డబుల్‌ ధమాకా పేల్చాడు.