ఘనంగా రానా బర్త్ డే సెలబ్రేషన్స్

భళ్లాళదేవుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. పెళ్లి తర్వాత రానా సెలబ్రేట్ చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు. దీంతో రానాకి ఈ బర్త్ డే వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఆదివారం రాత్రి నుంచే రానా బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయ్. తాజాగా ఆయన కేట్ కట్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక రానా తన పుట్టినరోజు కానుకగా అభిమానులకి రెండు బహుమతులు ఇచ్చారు. ఆయన తాజా చిత్రం విరాటపర్వం ఫస్ట్ లుక్ తో పాటు.. ఈ సినిమా నుంచి చిన్నపాటి టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో నక్సలైట్ రవన్న పాత్రల్లో రానా ఒదిగిపోయినట్టు టీజర్ ని చూస్తే అర్థమవుతోంది.