మోనాల్’పై ప్రేమ.. ఓవర్ చేస్తున్నట్టున్నాడు ?


బిగ్ బాస్ హౌజ్ లో గ్లామర్ డోస్ మిస్సయింది. మోనాల్ ఎలిమినేట్ కావడంతో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ హగ్ లు, ఏడుపులు మిస్ అయ్యాయ్. ఇక మోనాల్ లేని రోజు అఖిల్ కి భారంగా గడిచింది. సోమవారం ఏపీసోడ్ లో మోనాల్ ని తలచుకుంటూ అఖిల్ ఎమోషన్ అయ్యాడు. అతడి రియాక్షన్స్ కొందరు ఓవర్ యాక్షన్ అంటే.. మరికొందరు మాత్రం లవ్ అంటున్నారు.

ఇంతలో మోనాల్ ని తలచుకుంటూ అఖిల్ ఏమన్నాడంటే ? “గార్డెన్ ఏరియాలో సోలోగా కూర్చొని నాతో మాట్లాడు అని చెప్పే టైప్ కాదు నేను. నా గుండె చాలా భారంగా ఉంది.. ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా నేను.. ట్రై చేస్తున్నా ఆలోచించకుండా.. అవ్వడం లేదు నా వల్ల తట్టుకోలేకపోతున్నా. అన్నీ లోపల పెట్టుకుంటే బ్రేక్ అవుతాననే భయంతో భయటకు మాట్లాడేస్తున్నా. ఏడుపు రావద్దు.. వద్దు.. వద్దు చాలా కంట్రోల్ చేసుకుంటున్నా” అంటూ అఖిల్ ఎమోషన్ అయ్యాడు.

ఇక బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికొచ్చాక మోనాల్ ని కలుస్తానని అఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే. కలిసినప్పుడు ఏం చెబుతాడు ? ప్రపోజ్ చేస్తాడా?? బిగ్ బాస్ హౌజ్ లో చిగురించిన వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా ? అన్నది కాలమే చెప్పాలి. ఇక అభిజిత్ కూడా గుజరాత్ వచ్చి మోనాల్ ని కలుస్తానని చెప్పాడు. అయితే అఖిల్ మాత్రం మోనాల్ అమ్మగారిని కలవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. క్లారిటీ ఎక్కువగా ఉండే అభిజిత్ మోనాల్ ప్రేమలో పడే ఛాన్సే లేదంటున్నారు ఆయన అభిమానులు.