ఆ సెంటిమెంట్’కు ‘ఫైటర్’ బలవుతాడా ?

సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. కొన్ని కాంబినేషన్స్ కి హిట్, మరికొన్ని కాంబినేషన్స్ ప్లాప్.. డిజాస్టర్ గా చూస్తుంటారు. తెలుగులో సినిమాల్లో యాక్షన్ కింగ్ అర్జున్ పేరిట ఓ డిజాస్టర్ సింటిమెంట్ ఒకటి ఉంది. ఆయన సపోర్టింగ్ రోల్స్ నటించిన తెలుగు సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయ్. ‘శ్రీ ఆంజనేయం’, ‘లై’. ‘నా పేరు సూర్యా..నా ఇల్లు ఇండియా’ తదితర సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయ్. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అబిమానులు జంకుతున్నారు.

పూరి-విజయ్ కలయికలో ప్యాన్ ఇండియా సినిమా (ఫైటర్) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ తండ్రి పాత్ర కోసం అర్జున్ ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ తెలిసి.. విజయ్ అభిమానులు అందోళన చెందుతున్నారు. డిజాస్టర్ సెంటిమెంట్ ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే పూరి లెక్కలు వేరు. ఆయన చేతిలో పడితే ఆయన మార్క్ రావాల్సిందే. అర్జున్ విషయంలోనూ డిజాస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాతో చెరిగిపోవడం ఖాయమని మరో వర్గం అభిమానులు చెప్పుకుంటున్నారు.