రజనీకాంత్ పార్టీ పేరు, గుర్తు.. ఇవే !

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న పార్టీ ఏర్పాటుపై ప్రకటన. జనవరిలో పార్టీ జెండా-అజెండాలని ప్రకటించనున్నారు. వచ్చే యేడాది మే నెలలో జరగనునన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీకి దిగనుంది. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలం సృష్టించాలని భావిస్తోంది.

ఇక రజనీకాంత్ తన పార్టీగా ‘మక్కల్ సేవై కట్చి (ప్రజా సేవ పార్టీ అని అర్థం)’ అని, పార్టీ గుర్తుగా ‘ఆటో రిక్షా’ని రిజిష్టర్ చేయించారని సమాచారమ్. అంతకు ముందు రజినీ పార్టీ పేరుని మక్కల్ సేవ కజగం, గుర్తుగా బాబా సినిమాలో చూపించిన సింబల్‌ను అడిగినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే సన్నిహితులు, అభిమాన సంఘాల ప్రతిత్నిధుల చర్చించిన అనంతరం రజనీ పార్టీ పేరుని రజనీ ‘మక్కల్ సేవై కట్చి’, అటో రిక్షాని పార్టీ గుర్తుగా ఎంచుకున్నట్టు తెలిసింది.

ఇక ప్రస్తుతం రజనీ ‘అన్నాత్తె’ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి శివ దర్శకుడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తమిళ రాజకీయాల్లో రజనీ పార్టీ హిట్ అయి.. అధికారంలోకి వస్తే గనుక ఇదే రజనీ సినిమా కావొచ్చని చెబుతున్నారు.