తెలంగాణ భాజాపాకు గట్టోడు దొరికాడు !
తెలంగాణలో భవిష్యత్ భాజాపాదే. ఇది సామాన్యుడు మాట. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ భాజాపాకు ఊపొచ్చింది. బలమొచ్చింది. తెరాసకు ప్రత్యామ్నాయం భాజాపా అని స్పష్టత వచ్చింది. అంతేకాదు.. తెలంగాణ భాజాపాకు బండి సంజయ్ రూపంలో గట్టోడు దొరికాడు. సీఎం కేసీఆర్ కు సరైన మొగుడు దొరికాడని ప్రజలు చెప్పుకుంటున్నారు. బహుశా.. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ ఇంతలా ఎదుర్కొన్న నేత, భయపెట్టిన నేత లేడేమో !
ఎన్నికల సమయంలోనే కాదు.. ఎన్నికల తర్వాత కేసీఆర్ కు బండి సంజయ్ చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం ఢిల్లీలో మాట్లాడిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గల్లీలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడి.. ఢిల్లీ వచ్చి వంగి వంగి దండాలు పెడితే క్షమించే ప్రసక్తే లేదు. అతి త్వరలోనే కేసీఆర్ జైలుకి వెళ్తారని బండి సంజయ్ హెచ్చరించారు.
మొత్తానికి.. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనని భాజాపాకు అనుకూలంగా మార్చుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ రూ. 20 వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు కుట్రను పన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ ఇంట్లో ఈడీ దాడులు జరగవచ్చనే సంకేతాలిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి దృష్టినుంచి ప్రజలని మళ్లీంచడానికే సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చారని బండి అన్నారు. మొత్తానికి… బండి దూకుడుతో సీఎం కేసీఆర్ కి ఫామ్ హౌస్ లో కూడా నిద్రపట్టడం లేదట.