పవన్.. పెద్ద తాగుబోతు !

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ఆయన పెద్ద తాగుబోతు అట. లేవగానే పెగ్ ఏస్తాడట. అలాగని.. ఇది రియల్ లైఫ్ లో కాదు. వకీల్ సాబ్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే లాయర్ పాత్రలో పవన్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమాలో పవన్ కు మరో షేడ్ కూడా ఉంటుంది. అదే తాగుబోతు గెటప్.

సినిమాలో పవన్ ను పరిచయం చేయడమే ఇలా తాగుబోతుగా పరిచయం చేయబోతున్నారట. తాగుబోతు పాత్రల్లో పవన్ ఇరగదీస్తాడన్న సంగతి తెలిసిందే. జల్సా, గుడుంబా శంకర్, ఖుషీ, బద్రి, జల్సా సినిమాల్లో తాగుబోతు సన్నివేశాల్లో నటించాడు పవన్అ అయితే అందులో తాగి కామెడీ చేశాడు. అయితే వకీల్ సాబ్ లో పవన్ తాగినా సీరియస్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. మొత్తానికి.. పవన్ తాగుబోతు అన్న లైన్ ఆకట్టుకుంటోంది.