ఆదిపురుష్.. అప్పుడే అగ్గి రాజుకుంది !
రామాయణం, మహాభారతాలని ముట్టుకోవాలంటే ధైర్యం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. వివాదాలు చుట్టుముడతాయ్. ఊపిరి ఆడకుండా చేస్తాయ్. ఇప్పుడు ‘ఆదిపురుష్’ విషయంలోనూ వివాదం మొదలైంది. ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రమిది. రామాయణ యుద్ధకాండగా ఆదిపురుష్ తెరకెక్కనుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారని తెలిసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్, దాంట్లో తన పాత్రపై కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇప్పుడు అదే కొంపముంచుతోంది. రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆదిపురుష్ చిత్రంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ అనే న్యాయవాది జౌన్‌పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ మతవిశ్వాసాలు దెబ్బతినేలా సైఫ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఓం రౌత్, సైఫ్‌పై శ్రీవాస్తవ పిల్ వేశాడు. దీనిపై విచారణ జరుగుతుంది. క్లాప్ కూడా కొట్టకముందే ఆదిపురుష్ టీమ్ కోర్టుమెట్లు ఎక్కాల్సి వస్తోంది.