బిగ్ బాస్ విన్నర్ : అభిజిత్ కి షాక్ ఇవ్వబోతున్న అరియానా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 క్లైమాక్స్ కి చేరుకుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 విన్నర్ గా ఎవరు నిలుస్తారు ? అనే చర్చ సాగుతోంది. అభిజిత్ విన్నర్ అని మొదటి నుంచి వినిపిస్తున్న మాట. అయితే క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ అన్నట్టుగా.. అభిజిత్ కు అరియానా షాక్ ఇవ్వబోతుందని సమాచారమ్.

ఇప్పటివరకు వచ్చిన ఓట్లలో అరియానా టాప్ లోకి దూసుకెళ్లినట్టు సమాచారమ్. ఆమె తర్వాతి స్థానాల్లో అభిజిత్, సోహల్, అఖిల్, హారిక ఉన్నారని సమాచారమ్. బిగ్ బాస్ 4 విన్నర్ గా అభిజిత్ లేదా సోహైల్ ఉంటారన్నది బిగ్ బాస్ అభిమానుల అంచనా. కానీ వారి అంచనాలని తలక్రిందులు చేస్తూ అరియానా దూసుకొస్తోంది.

రేపటి వరకు టైమ్ ఉన్న నేపథ్యంలో.. ఈ ర్యాంకుల లెక్కలు మారుతాయోమో.. బిగ్ బాస్ విన్నర్ మారుతారెమో చూడాలి. ఇదీగాక.. ఈ సారైనా మహిళ బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలని ఆశపడుతున్న అభిమానుల ఓట్లు అరియానాకు గంపగుత్తుగా పడుతున్నాయని చెబుతున్నారు. టాప్ – 5 ఫైనలిస్టులో బెర్త్ ఖరారైన టైమ్ లోనే అరియానాకు కళ్లు తిరిగి పడిపోయింది. ఇక విన్నర్ గా నిలిస్తే.. భూమ్మీద ఆమె కాలు నిలవదేమో !