పోలీస్ శాఖలో 20వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో కొలువుల జాతర మొదలుకాబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం 50వేల ఉద్యోగాల భర్తీ కోసం ఏకకాలంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో 20వేల పోస్టులు పోలీస్ శాఖలో భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పోలీస్‌శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించి, నివేదికను సమర్పించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. తెలంగాణ రాష్ట్రస్థాయి పోక్లీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్పీఆర్బీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు పడిన దెబ్బ, రాబోయే గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ హడావుడిగా ఉద్యోగాల ప్రకటన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని చెప్పుకొంటున్నారు. అయితే నోటిఫిషన్స్ వేయగానే సరిపోదు. పరీక్షలు నిర్వహించిన వారికి పోస్టింగ్ లు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఉద్యోగాల భర్తీతొ సీఎం కేసీఆర్ మరోసారి నాటకాలకి తెరలేపారని ఆరోపిస్తున్నారు.