అమెరికా కరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్
మహమ్మారి కరోనాకు టీకాలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే భారత్ లో కరోనా టీకాని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెరికాలో ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకాను పొందిన ఇద్దరు ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి అలర్జీలు తలెత్తాయి.
అలాస్కా రాష్ట్రంలోని బార్ట్లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఒక ఆరోగ్య కార్యకర్తకు గతంలో ఎన్నడూ అలర్జీలు తలెత్తలేదు. కరోనా టీకా ఇచ్చాక 10 నిమిషాల్లోనే ఆ లక్షణాలు కనిపించాయి. ఆమె ఒంటిపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిసార్లు ఈ పరిస్థితి ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు పేర్కొన్నారు.