ఎన్టీఆర్-చరణ్.. ఓ భారీ ఫైట్ సీన్ ! 

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో తారక్-చరణ్ ల మధ్య ఓ భారీ ఫైట్ సీన్ ఉండనుంది. ఇంట్రవెల్ కి ముందు వచ్చే ఈ ఫైట్ సీన్ 8 నిమిషాల పాటు ఉండనుందట. ఈ ఫైట్ చిత్రీకరణ మాత్రం 40 రోజుల పాటు సాగనుంది. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ ని షూట్ చేస్తున్నారు.

ఈ సీన్ తీస్తున్న టైమ్ లో ఓ షాట్ ఎంత ట్రయ్ చేసినా రాజమౌళికి సంతృప్తి కలిగించలేదట. ఇంక చాలు వదిలేద్దాం జక్కన్నా అని హీరోలు ఇద్దరూ చెప్పినా రాజమౌళి వినలేదని తెలుస్తోంది. ఆఖరికి రాజమౌళి స్వయంగా తానే రోప్స్ కట్టుకుని, పైనుంచి ఫీట్ చేస్తూ దూకి తనకు కావాల్సిన ఎఫెక్ఠ్ ను చూపించారట. దాంతో ఇక మాట్లాడేది లేక హీరోలు ఇద్దరూ మరో టేక్ చేసి ఓకె చేయించుకున్నారట.