తొలి టెస్ట్ : తొలి ఇన్నింగ్స్ లో భారత్’దే ఆధిక్యం
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి డే/నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆధిక్యం సాధించింది. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (4/55), ఉమేశ్ యాదవ్ (3/40), బుమ్రా (2/52) ఆసీస్ జట్టును బెంబేలెత్తించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ టిమ్ పైన్ (73*) ఒంటరి పోరాటం చేశాడు. లబుషేన్ (47) రాణించాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులతో శుక్రవారం ఆట ముగించింది. పృథ్వీ షా (4) మరోసారి విఫలమయ్యాడు. నాలుగో ఓవర్లో పృథ్వీ షాను కమిన్స్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం నైట్ వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాతో కలిసి మయాంక్ అగర్వాల్ (5*; 21 బంతుల్లో) మరో వికెట్ పడకుండగా జాగ్రత్తగా ఆడాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9/1 స్కోరుతో నిలిచింది.