పవన్ హీరోయిన్’తో ధన్ రాజ్.. తిట్టకండి !
పూనమ్ కౌర్ హీరోయిన్ గా కంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసే పాపులర్ అయింది. పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా పూనమ్ కామెంట్స్ చేసింది. పవన్ తో ఆమెకు ఏదో లింకు ఉన్నట్టు కటింగ్స్ ఇస్తూ ఉంటుంది. అంతేకాదు.. పవన్ స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ తనకి అన్యాయం చేశారు అనే విధంగా ఆమె వ్యవహారశైలి ఉంటుంది.
అందుకే ఆమె అంటే.. పవన్ ఫ్యాన్స్ భగ్గునమండిపోతారు. అలాంటి పూనమ్ కౌర్ తో ధనాధన్ ధన్ రాజ్ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానికి ‘తిట్టకండి’ అంటూ కామెంట్ పెట్టాడు. బహుశా.. పవన్ అభిమానులని ఉద్దేశించే ధనరాజ్ ఆ కామెంట్ పెట్టి ఉంటాడు. ఇక టైమ్ దొరికినప్పుడల్లా పవన్ పై విరుచుకుపడే పూనమ్.. ఈ మధ్య మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చినట్టుంది.
తిట్టకండి 🙏🏾 pic.twitter.com/dRHa4qu0rj
— Dhanraj (@DhanrajOffl) December 18, 2020