తారక్ టీజర్.. కామెంట్స్’తో కొట్టారు !


‘రామరాజు ఫర్ భీమ్’ యూట్యూబ్ లో సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ టీజర్ ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా కామెంట్స్‌ని దక్కించుకోగా, 3.5 కోట్లకు పైగా వ్యూస్, 12 లక్షల లైకులు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇక ఈ టీజర్ లో తారక్ ని ముస్లిం యువకుడి గెటప్ చూపించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొమరం భీమ్ ని ముస్లిం యువకుడిగా చూపించడంపై గిరిజనులు, రాజకీయ పక్షాలు మండిపడ్డాయ్. ఈ ఒక్కటి మినహా టీజర్ అదిరిపోయింది.

ఇక ఆర్ ఆర్ ఆర్ ని బాహుబలిని మించేలా చెక్కుతున్నాడు జక్కన్న. ప్రస్తుతం మహాబలేశ్వరం ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏదా సమ్మర్‌లో ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. అంతకంటే ముందు ఓ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారమ్. ఈ షో కోసం తారక్ ఏకంగా రూ. 18 కోట్లు తీసుకోనున్నారని చెప్పుకొంటున్నారు.