బిగ్‌బాస్‌ సీజన్‌-4 హైలైట్స్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా పూర్తయింది. విజేతగా అభిజిత్ నిలిచారు. రన్నర్ గా అఖిల్ నిలిచారు. ఇక సోహైల్, అరియానా, హారిక వరుసగా 3,4,5 స్థానాల్లో నిలిచారు. 105 పాతు నిర్విరామంగా సాగిన బిగ్ బాస్ 4 హైలైట్స్ పై ఓ లుక్కేద్దాం.

* సెప్టెంబరు 6న మొదలైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌-4’ 105 రోజుల పాటు నిర్విరామంగా సాగింది.

* కరోనా నేపథ్యంలో ఈసారి హౌస్‌లోకి వెళ్లేవారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరినీ కరోనా టెస్టు చేసి, క్వారంటైన్‌ తర్వాతే హౌస్‌లోకి పంపారు.

* సూర్య కిరణ్‌, కల్యాణి, దేవి, స్వాతి, గంగవ్వ, సుజాత, దివి, నోయల్‌, అమ్మా రాజశేఖర్‌, మెహబూబ్‌, లాస్య, అవినాష్‌, మోనల్‌, హారిక, అరియానా, సోహైల్‌, అఖిల్‌, అభిజీత్‌ మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు ఈ సీజన్‌లో పాల్గొన్నారు.

* వీరిలో కుమార్‌ సాయి, అవినాశ్‌, స్వాతి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్లారు.

* గంగవ్వ, నోయల్‌లు అనారోగ్యం కారణంగా సీజన్‌ మధ్యలోనే హౌస్‌ విడిచి వెళ్లిపోయారు.

* దసరా పండుగ సందర్భంగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

* 62వ రోజున తమిళ బిగ్‌బాస్ హౌస్‌ మేట్స్‌తో పాటు, వ్యాఖ్యాత కమల్‌ హాసన్‌ తెలుగు బిగ్‌బాస్‌ షోలోని వారితో వర్చువల్‌గా మాట్లాడారు.

* 100వ రోజు స్పెషల్‌గా హరితేజ (సీజన్‌-1), గీతా మాధురి (సీజన్‌-2), శ్రీముఖి (సీజన్‌-3) అలీ రెజా (సీజన్‌-3)లో పాల్గొన్న వారితో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

* ఇక గ్రాండ్ ఫినాలేలో దర్శకుడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. ఇంటి సభ్యులతో కలిసి ఫన్ ని పంచారు. 

* బిగ్ బాస్ స్టేజ్ పై మెహ్రీన్, లక్ష్మీరాయ్, పరిణీతి చోప్రా డ్యాన్సులు చేశారు

* మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ కి ట్రోఫీ అందుకున్నారు.