బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. మెగా ఆఫర్లు !


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్స్ పంటపండింది. వారిపై మెగా ఆఫర్లు కురిశాయి. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన చేతుల మీదుగా విజేత అభిజిత్ కు ట్రోఫిని అందించారు. అదే సమయంలో మిగితా కంటెస్టెంట్స్ ని చిరు ఖుషి చేశారు. వారికి మెగా ఆఫర్లు ఇచ్చారు.

సోహైల్ తీసే సినిమాకు సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసేందుకు ఓకే చెప్పేశారు. దివికి తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు చిరు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించనున్న లూసిఫర్ తెలుగు రిమేక్ లో పోలీస్ పాత్రని ఆఫర్ చేశారు. మరో 8-9 నెలల్లో దివితో కలిసి నటించబోతున్నాని తెలిపారు.

ఇక మెగా ఆఫర్ల కంటే మించి మెగా అభినందనలు, ప్రశంసలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కడుపునింపేశాయి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోహైల్ కోసం చిరు భార్య సురేఖ బిర్యానీ వండి పంపించింది. మెహబూబ్ లో తనని తాను చూసుకుంటున్నా. యవ్వనంలో నాలోఉన్న కసి మెహబూబ్ లో కనిపించిందన్నారు. అరియానా, హారికలతో పాటు మిగిలిన ఇంటి సభ్యులపై మెగా ప్రశంసలు కురిశాయి.