కొత్తరకం కరోనా.. మళ్లీ లాక్‌డౌన్ !
బ్రిటన్‌లో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి. మరోసారి లాక్‌డౌన్ దిశగా సమాలోచనలు చేస్తున్నాయి. తమ దేశంలో కొత్త రకం కరోనా వైరస్, నియంత్రించలేని విధంగా వ్యాప్తిస్తోందని బ్రిటన్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు యూరోపియన్ దేశలు బ్రిటన్ విమానాలపై నిషేధాజ్ఞలను జారీ చేశాయి.
ఇక సౌదీ పొరుగు దేశం కువైట్ కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కెనడా ప్రభుత్వం కూడా యూకేకు రాకపోకలు నిలిపివేసింది. అత్యవసర సందర్భాల్లో తప్ప అన్ని విదేశీ విమానాలను ఒక వారం పాటు నిషేధిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అంతేకాకుండా జల, భూ మార్గాల ద్వారా ప్రవేశాలను కూడా సౌదీ నిషేధించింది. పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని మరోవారం పాటు పొడగించే అవకాశముందని సౌదీ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది.