కొత్త రకం కరోనా వైరస్’పై కేంద్రం స్పందన !
బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు భయపడిపోతున్నాయ్. వెంటనే బ్రిటన్ నుంచి రాకపోకలని నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి వచ్చే విమానాలని నిలిపివేయాలని ఢిల్లీ సీఎం క్రేజీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొత్త రకం కరోనా వైరస్ పై స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఈ సమయంలో ఊహలు, ఆలోచనలు, భయాందోళనలు పడకండి. ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంది. గత సంవత్సరం నుంచి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, శ్రేయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూనే ఉన్నాం. నన్ను అడిగితే మాత్రం… భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేనేలేదు.” అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.