జమిలి ఎన్నికలకు ఎన్నికల సంఘం రెడీ !

దేశ వ్యాప్తంగా ఒకేసారి (జమిలి) ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు ఉండడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండి.. అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోందని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. ఎన్నికల ఖర్చు కూడా పెరుగుతోందన్నారు. అన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా ఉండాలని ప్రధాని మోదీ అభిలషించారు. 

తాజాగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా అన్నారు. ప్రభుత్వం నిర్ణయిస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు అవసరం అని ఆయన తెలిపారు.