కొత్తరకం కరోనా ఎఫెక్ట్.. ముంబైలో ఆంక్షలు !

బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయ్. బ్రిటన్ నుంచి విమాన రాకపోకలని నిలిపివేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. కొత్తరకం కరోనా ఎఫెక్ట్ తో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ముంబై నగర పాలక సంస్థ పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపింది.

మంగళవారం నుంచి నైట్‌ కర్ఫ్యూ మొదలవుతుందని వివరించింది. యూరోపియన్‌ యూనియన్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి వచ్చే రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు మంగళవారం నుంచి తప్పనిసరి సంస్థాగత క్వారంటైన్‌కు వెళ్లాలని స్పష్టం చేసింది. వాస్తవానికి ఆదివారంమే సీఎం ఉద్దవ్ థాక్రే కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే పరిస్థితులు మారాయి. కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చిందన్న వార్తలతో ముంబైలో రాత్రి వేళల్లో కర్ప్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.