కొత్తరకం కరోనా.. ఈ కఠిన నియామాలు పాటించాల్సిందే !
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ మరోసారి ప్రపంచ దేశాలని వణికిస్తోంది. రూపుమార్చుకున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు కాస్త రూపు మార్చుకున్న ఈ నూతన వైరస్ ప్రస్తుతానికి బ్రిటన్‌తోపాటు మరో 4-5 దేశాల్లో వెలుగుచూసింది. అయితే కొత్త రకం కరోనా వైరస్ ఇంతకుముందు వైరస్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. మరోవైపు ఈ కొత్తరకం కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది.
“ప్రస్తుతం మనం అమలు చేస్తున్న నిబంధనలనే మరింత జాగ్రత్తగా పాటించాలి. అలాగే దీర్ఘ కాలం అనుసరించాలి. అలా అయితే కొత్త రకం కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టవచ్చు. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరమూ ఉంది” అని డబ్ల్యూహెచ్‌వో అత్యవసర కార్యక్రమాల విభాగాధిపతి మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. ఇక భారత్ సహా అనేక దేశాలు ముందుజాగ్రత్త చర్యగా బ్రిటన్ కు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నసంగతి తెలిసిందే.