కొత్తరకం కరోనా వైరస్.. భారత్’లోకి ఎంట్రీ ఇచ్చేసిందా ?

బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ ఇప్పటికే భారత్‌లో చేరి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ కంటే కొత్తరకం కరోనా వైరస్ ప్రభావం 70శాతం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.

‘ఈ కొత్త వైరస్‌ భారతదేశానికి ఇప్పటికే చేరుకునే అవకాశాలున్నాయని, ప్రజలు మాస్క్‌లు ధరించకపోతే మాత్రం మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజిఐబి) డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ అన్నారు. అలాగే కరోనా టీకా ‘సోకిన కణాలను చంపి, వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. నిరోధించే కణాలను సూచిస్తుంది’ అని తెలిపారు.

కొత్తరకం వైరస్ విషయంలో ఇప్పటికే భారత్ అప్రమత్తం అయింది. కొత్త వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి లండన్‌ నుండి వచ్చే విమానాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. లండన్‌ నుండి వచ్చిన 22 మంది ప్రయాణీకుల్ని.. ఢిల్లీకి చెందిన ఆరుగురు ప్రయాణీకులతో సహా కరోనా పాజిటివ్‌ పరీక్షల్ని నిర్వహించారు. నిపుణులు వాటి నమూనాలను జన్యుశ్రేణి కోసం కూడా పంపారు.