దక్షిణాఫ్రికాలో బయటపడిన మరో కొత్త వైరస్.. ఇదీ మరీ డేంజర్.. !

బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కరోనా వైరస్ కంటే 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయ్. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలని రద్దు చేశాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో మరో కొత్తరకం వైరస్ వెలుగులోనికి వచ్చింది. ఇద్దరిలో ఈ వైరస్ ని గుర్తించారు.

ఇది బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన స్ట్రైయిన్ కంటే డేంజర్ అని చెబుతున్నారు. క్షణాల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాను ఈ కొత్త స్ట్రెయిన్ గడగడలాడిస్తోంది. కొన్నివారాల్లో దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ కు వేలాది మంది ప్రయాణించారు. వారిలో ఇంకెంతమంది కొత్త స్ట్రెయిన్ ను స్ప్రెడ్ చేశారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి.. దక్షిణాఫ్రికా, బ్రిటన్ లో బయటపడిన సరికొత్త కరోనా వైరస్ లు ప్రపంచ దేశాలని భయపెట్టేస్తున్నాయి.