వెబ్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ కూతురు
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార.. సోషల్ మీడియాలో స్టార్ అన్న సంగతి తెలిసిందే. మహేష్ సినిమాలోని పాటలకి డ్యాన్స్ చేయడం, డైలాగ్స్ కు యాక్షన్ చేయడం చేస్తుంటుంది. మహేష్ కూతురు సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ ని కూడా నడుపుతున్నారు. దర్శకుడు వంశీపైడిపల్లి కూతురుతో కలిసి ఈ చానెల్ ని నడిపిస్తున్నారు. తాజాగా సితార బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తింది.
3డీ యానిమేషన్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించిన ‘ఫంటాస్టిక్ తార’కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరుల సమక్షంలో సితార విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సితార స్పీచ్ ఆకట్టుకుంది. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.