సలామ్ : 5 నెలల గర్భవతి 10కి.మీ పరుగెత్తెంది

ఆమె ఒట్టి మనిషి కాదు.. గర్భవతి. ఐదు నెలల గర్భవతి. అయినా 10 కి. మీలు పరుగెత్తింది. అది కూడా 62 నిమిషాల్లో. బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్‌. బెంగళూర్ సీటిలో జరిగే పరుగు పోటీల్లో తొమ్మిదేళ్లుగా పాల్గొంటూనే ఉంది. టీసీఎస్‌ 10కే రన్‌లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూ ఉంది. ప్రస్తుతం 5 నెలల గర్భవతైనా ఆమె స్ఫూర్తిగొలిపే పరుగును ఆపలేదు. ఎప్పటిలాగే పరుగును పూర్త చేసింది. దీంతో ఆమె ప్రశంసలు అందుతున్నాయి.

“ఈ పరుగు పందెలలో తొమ్మిదేళ్లుగా పాల్గోంటున్నాను, నా శ్వాసలానే పరుగుకు కూడా నా జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు నేను పరుగెడుతునే ఉంటానని తెలిపారు”. అలాగే అంకిత ఇప్పటివరకు ఐదు అంతర్జాతీయ మారథాన్‌లలోనూ పాల్గొన్నట్లు తెలిపింది. బెర్లిన్‌లో మూడుసార్లు కాగా బోస్టన్, న్యూయార్క్‌ మారథాన్‌లలో ఒక్కోసారి పాల్గోన్నారు.