ఏపీలో 3 రోజుల లాక్ డౌన్ ?

ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మూడ్రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్య్ంలో కరోనా తిరిగి విజృంభించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మూడ్రోజుల పాటు లాక్ డౌన్ ఆలోచన చేస్తుంది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయని చెప్పుకొంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని నిన్నటి వరకు ఉన్నతాధికారులు కొట్టిపారేశారు.

అయితే ఈరోజు బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళా ఢిల్లీలో క్వారంటైన్ నుంచి తప్పించుకుని రాజమండ్రికి వచ్చింది. ఆమెకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. అయితే ఆమెకి సోకింది పాత రకం కరోనా వైరస్ నా ? కొత్త రకం కరోనా వైరస్ నా ?? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే కొత్తరకం కరోణా వైరస్ గా తేలితే మాత్రం.. మరోసారి ఏపీలో లాక్ డౌన్   విధించిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో ! ప్రస్తుతానికైతే ఏపీలో మూడ్రోజుల పాటు లాక్ డౌన్ అన్నది మాత్రం ఉత్తిత్తి ప్రచారం మాత్రమేనని చెబుతున్నారు.