హైదరాబాద్ అపోలో హాస్పటల్’లో చేరిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో హాస్పటల్ లో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. గత పదిరోజులుగా అన్నాత్తె షూటింగ్ లో హైదరాబాద్ లోనే ఉన్నారు రజనీ. ఈ సినిమా చిత్రబృందంలోని పలువురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ని వాయిదా వేశారు. ఈ నెల 22న రజనీకి కరోనా టెస్ట్ చేయగా.. నెగటివ్ వచ్చింది. అయినా.. ఆయన హోంక్వారంటైన్ లోనే ఉంటున్నారు. అయితే హోంక్వారంటైన్ లో ఉన్న రజనీ బ్లెడ్ ప్రెషన్స్ సమస్యతో ఈ ఉదయం అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఆసుపత్రి యాజమాన్యం ప్రెస్ నోట్ ని రిలీజ్ చేసింది.

ఈ నెల 31న రజనీ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయాల్సి ఉంది. ఈలోగా అన్నాత్తే షూటింగ్ ని పూర్తి చేయాలని భావించారు. కానీ ఆ ప్రయత్నాలకు కరోనా బ్రేక్ వేసినట్టయింది. ఇక రజనీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో.. ఈ నెల 31న పొలిటికల్ పార్టీ ప్రకటన కూడా వాయిదా పడనుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. పొలిటికల్ పార్టీ ప్రకటన, ఆ తర్వాత నెలకొనే పరిస్థితులని అంచనా వేసిన రజనీ కాస్త ఒత్తిడి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయన బ్లెడ్ ప్రెజర్ సమస్యతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక రజనీ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.