రెండో టెస్టుకు భారతజట్టు.. ఇదే !

శనివారం నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ తుది జట్టు ప్రకటించింది. మొత్తం మూడు మార్పులని చేశారు. ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ పృథ్వీషాను తొలగించింది. మయాంక్‌కు తోడుగా శుభ్‌మన్‌గిల్‌కు అవకాశం ఇచ్చింది. వికెట్‌ కీపర్‌ స్థానంలో వృద్ధిమాన్‌ సాహాను పక్కనపెట్టి రిషభ్‌పంత్‌ను ఎంపిక చేసింది. అలాగే గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమైన మహ్మద్‌ షమి స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ను తీసుకుంది. ఇక ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా సైతం తుది జట్టులో అవకాశం పొందాడు. అయితే కెఎల్ రాహుల్ కి మాత్రం అవకాశం దక్కలేదు. హనుమ విహారిపై నమ్మకం ఉంచారు. 

భారత జట్టు :అజింక్య రహానె (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, పంత్, జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, బుమ్రా