అలర్ట్ : న్యూఇయర్ వేడుకలకి అనుమతి లేదు


2020 – ఎవ్వరినీ వదల్లేదు. అందరికి చుక్కలు చూపించింది. ఈ బ్యాడ్ ఇయర్ కి మందేసి.. చిందేసి గుడ్ బై చెప్పాలని ప్లాన్ చేసుకుంటున్నవారికి పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. నగరంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. పబ్‌లు, బార్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కరోనా లాక్‌డౌన్ తర్వాత శుక్రవారం నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు మొదలయ్యాయ్. వాటిని మరింత విస్తృతం చేస్తామని సీపీ తెలిపారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లోనూ కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించవద్దని చెప్పారు. వేడుకలు నిర్వహిస్తున్నామంటూ నిర్వాహకులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని.. పాస్‌లు, టికెట్‌ విక్రయిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. హోటళ్లలోనూ వేడుకలకు అనుమతి లేదన్నారు.