మీ వైరస్ కంటే.. మా వైరస్ డేంజర్ కాదు !

బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాల్లో మూడు వేర్వేరు రకాల కరోనా వైరస్‌లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బిట్రన్ లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ 70శాతంగా వేగంగా వ్యాపిస్తుందని అంచనా వేస్తున్నారు.

బ్రిటన్‌లో బయటపడిన కొత్త రకం కరోనాను మించిన వేగంతో వ్యాపించే లక్షణాలు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన వైరస్‌కు ఉన్నాయని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మట్‌ ఇన్‌కాక్ ఇటీవల వెల్లడించారు. కాగా.. బ్రిటన్‌ మంత్రి వ్యాఖ్యలను దక్షిణాఫ్రికా తీవ్రంగా ఖండించింది. తమ దేశంలోని వైరస్‌ యూకేలోని కరోనా రకం కంటే ప్రమాదకరం కాదని స్పష్టం చేసింది.

కొవిడ్ కొత్తరకంపై బ్రిటన్‌ ఆరోగ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. యూకేలో వెలుగుచూసిన కరోనా కొత్త రకం కంటే 501.వీ2(దక్షిణాఫ్రికా రకం) వేగంగా వ్యాపిస్తుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. దీని వల్ల వైరస్‌ తీవ్రత లేదా మరణాల రేటు పెరుగుతుందని చెప్పేందుకు కూడా స్పష్టమైన ఆధారాలు లేవు’ అని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జ్వెలిని కిజే ఓ ప్రకటనలో వెల్లడించారు.