శ్రీదేవి డెత్ కేసు : అది ఫోరెన్సిక్ రిపోర్ట్ కాదట
అతిలోక సుందరి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయి రెండు రోజులు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆమె పార్థవదేహం దుబాయ్ నుంచి ముంబైకు చేరుకోలేదు. ఇదీగాక, ఆమె డెత్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా ఆమె భర్త బోనీకపూర్ నే అనుమానించారు దుబాయ్ పోలీసులు. ఈ చర్య భారత్ దేశ ప్రజలకు, అతిలోక సుందరి అభిమానులని షాక్ కు గురిచేసింది.
ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అది ఫోరెన్సిక్ నివేదిక కాదని హైదరాబాద్ పోలీసులు తేల్చి పారేశారు. ఆ నివేదిక కేవలం అభిప్రాయమేనని అంటున్నారు. యాక్సిడెంటల్ డ్రోనింగ్ అనే పదం వాడకం కూడా సరికాదని పేర్కొంటున్నారు. ఇన్విస్టిగేషన్ బృందం వెల్లడించాల్సిన అంశాలను ఫోరెన్సిక్ వారు ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఫోరెన్సిక్ నివేదిక అంటే అనేక అంశాలుంటాయని, ఇంత సంక్షిప్తంగా ఉండదని చెబుతున్నారు. మొత్తానికి.. శ్రీదేవి డెత్ కేసులో షాకింగ్ నిజాలు బయటపడేలా కనిపిస్తున్నాయి.