బాక్సింగ్ డే టెస్ట్ : తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 195 ఆలౌట్, భారత్ 23/1
బాక్సింగ్‌డే టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 195 పరులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3. సిరాజ్ 2 వికెట్లు తీశారు.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 30, లబుషనే 48, ట్రావెస్ హెడ్ 38, లయాన్ 20 రన్స్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 15 ఓవర్లు వేసిన సిరాజ్ తన బౌలింగ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. లబుషనే, గ్రీన్ వికెట్లను సిరాజ్ తీసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే ఇండియా వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ ఎల్బిడబ్ల్యూ రూపంలో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం శుభమ్ గిల్ (11), పూజారా (4) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో రహానే కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. రహానే బౌలర్లని బాగా ఉపయోగించుకున్నారని ఆసీస్ మాజీ ఆటగాడు మెక్ గ్రాత్ అన్నారు. బుమ్రా, అశ్విన్ రంగంలోకి దింపి కీలక వికెట్లని రాబట్టారన్నారు.