తొలి మహిళా బస్సు డ్రైవర్‌

మహిళలు ఏమాత్రం తక్కువ కాదు. పురుషులతో సమానంగా అన్నీ రంగాల్లో రాణిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌ కు చెందిన మహిళ పురుషులు మాత్రమే చేయగలరనే అపోహను తొలగిస్తూ డ్రైవర్‌ వృత్తిని ఎంచుకుంది. జమ్మూకశ్మీర్‌లో ప్రయివేటు బస్సు నడుపుతూ అక్కడ తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డులకెక్కింది.

డ్రైవర్‌గా ఎందుకు మారారు అని ఎవరైనా అడిగితే.. ‘నేటి ఆడవాళ్లు యుద్ధ విమానాలే నడుపుతున్నారు. బస్సు నడిపితే తప్పేంటీ’ అని చిరునవ్వుతో పూజ సమాధానం చెబుతున్నారు.పూజాదేవి బస్సు నడుపుతున్న ఫొటోలు కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఈమె ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘జమ్మూకశ్మీర్‌ తొలి మహిళా బస్సు డ్రైవర్‌ పూజాదేవి. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది’ అని కొనియాడారు.